ఏపీ బెస్ట్ ర్యాంకులు.. టాప్ 10లో రెండు మ‌న‌వే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వై.ఎస్ జ‌గ‌న్ ఏ ముహూర్తాన సీఎంగా ప్ర‌మాణం చేశారో ఆయ‌న్ను ల‌క్ వెంటాడుతూనే ఉంది. మొన్న‌టికి మొన్న అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన ముఖ్యమంత్రుల్లో జ‌గ‌న్‌కు మంచి ర్యాంకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అది మ‌ర్చిపోక‌ముందే ఇండియాలోనే ఏపీ మ‌రో ఖ్యాతిని సొంతం చేసుకుంది.

స్వ‌చ్చ స‌ర్వేక్ష‌న్ అవార్డుల గురించి చాలా మందికి తెలియ‌దు. ఏంటంటే ప్ర‌తి రాష్ట్రంలో న‌గ‌రాల్లో ప‌రిశుభ్ర‌త‌ను బ‌ట్టి ఈ అవార్డులు అంద‌జేస్తారు. స్వ‌చ్చ స‌ర్వేక్ష‌న్ కేంద్రం ప‌రిధిలో ఉంటుంది. కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ స్వ‌చ్చ స‌ర్వేక్ష‌న్ అవార్డులు అంద‌జేస్తారు. న‌గ‌రాల్లో ప‌రిశుభ్ర‌త ఏ విధంగా ఉంది, ఏ విధ‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. చెత్త సేక‌ర‌ణ ఏ విధంగా జ‌రుగుతుంద‌న్న దానిపై కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ప్ర‌త్యేక దృష్టి పెడుతుంది.

ఇందులో భాగంగా ఈ ఏడాది స్వ‌చ్చ స‌ర్వేక్ష‌న్ అవార్డులు వచ్చాయి. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించి రెండు న‌గ‌రాలు టాప్ 10లో ఉన్నాయి. విజ‌య‌వాడ 4వ స్థానం, విశాఖ‌ప‌ట్నం 9 వ స్థానంలో ఉన్నాయి. దేశంలో మొట్ట‌మొద‌టి స్థానంలో ఇండోర్ ఉంది. ఇక 2018..19లో విశాఖ 23వ ర్యాంకులో ఉంటే ఇప్పుడు ఏకంగా 9వ స్థానానికి ఎగ‌బాకింది.

రాష్ట్రంలోని రెండు న‌గ‌రాల‌కు మంచి స్థానం ల‌భించ‌డంతో దేశంలోనే ఏపీ ప్ర‌త్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. స్వ‌చ్చ స‌ర్వేక్ష‌న్ అంటే న‌గ‌రాల్లో మున్సిపల్ వ‌ర్క్స్ బాగుండాలి. ఇవి బాగుంటే ప్ర‌జ‌లు అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉంటారు. మ‌రి వై.ఎస్ జ‌గ‌న్ వచ్చిన త‌ర్వాత  ప‌నితీరు ఎలా ఉందో ఈ స్వ‌చ్చ స‌ర్వేక్ష‌న్ అవార్డులు చూస్తే తెలిసిపోతోంద‌ని మేధావులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here