దేశం మొత్తం ధోని విష‌యంలో బాధ ప‌డింది.. ప్ర‌ధాని మోదీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ధోనికి లేఖ రాశారు. ఇటీవ‌లె ధోని అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌హీని ఉద్దేశించి మోడీ లేఖ రాశారు. ఇదే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

మ‌హేంద్ర సింగ్ ధోని రాజీనామా చేయ‌డం ప‌ట్ల ప్ర‌ధాని మోధీ స్పందిస్తూ ఆయ‌న‌కు లేఖ రాశారు. ధోని భార‌త క్రికెట్‌కు చాలా చేశార‌ని లేఖ‌లో మోదీ పేర్కొన్నారు. ఇన్నాళ్లు భార‌త క్రికెట్‌కు ఎన‌లేని కృషి చేసిన ధోని ఇక నుంచి ఫ్యామిలీతో గ‌డుపుతార‌ని అనుకుంటున్న‌ట్లు మోదీ చెప్పారు.

భార‌త దేశం మొత్తం మీ రిటైర్మెంట్ గురించి చ‌ర్చించుకుంద‌ని మోదీ లేఖ‌లో ప్ర‌స్తావించారు. దేశం మొత్తం ధోని క్రికెట్ ఆడ‌ర‌ని తెలిశాక తీవ్ర నిరాశ‌కు గురైంద‌ని మోదీ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. జ‌ట్టు ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా ధోని ముందుండి న‌డిపించార‌న్నారు. 2007లో టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఇందుకు ఉదాహ‌ర‌ణ అన్నారు.

ఉత్త‌మ కెప్టెన్‌గా, వికెట్ కీప‌ర్‌గా ధోని చిర‌స్థాయిలో నిలిచిపోతార‌న్నారు. ఎంతో మంది యువ‌త‌కు ధోని ఆద‌ర్శంగా నిలిచార‌న్నారు. క్రికెట్ త‌ర్వాత ఆయ‌న భ‌విష్య‌త్ బాగుండాల‌ని కోరుకుంటున్న‌ట్లు మోదీ లేఖ‌లో అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here