రకుల్ ను ఎన్‌సీబీ ఏం ప్రశ్నిస్తోంది..? రకుల్ ఏం సమాధానం చెబుతోంది.? 

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో మొదలైన వివాదం.. ఇప్పుడు డ్రగ్స్ అంశం చుట్టూ తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు నటి రియా చక్రవర్తి దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ కు సంబంధించిన వివరాలు పోలీసులకు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు బయట పెట్టడంతో ఈ

అంశం సంచలనంగా మారింది. దీంతో దీనిపై లోతుగా విచారణ చేపట్టిన ఎన్‌సీబీ అధికారులు మరికొందరు హీరోహీరోయిన్లకు డ్రగ్స్ పెడ్లర్స్‌తో సంబంధాలున్నట్లు కనుగొని దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌లకు నోటీసులు పంపారు.

ఈ క్రమంలోనే ఈరోజు (శుక్రవారం) ఎన్సీబీ అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ ను విచారిస్తున్న విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే ఎన్సీబీ కార్యాల‌యానికి చేరుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌ ను రియాతో డ్ర‌గ్స్ చాటింగ్ గురించి అధికారులు ప‌లు కోణాల‌లో  ప్రశ్నిస్తున్నట్లు స‌మాచారం.  మరి రకుల్ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతుందో..  ఈ విచారణలో ఎవరి పేర్లు బయట పడతాయో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here