రజనీకాంత్ కొత్త సినిమా?

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు రాజకీయాలలో అడుగు పెట్టిన నేపథ్యంలో ఇంకా ఆయన సినిమాలను చేయరు అనే వార్త గత కొన్నాళ్లుగా వినబడుతుంది. ప్రస్తుతం రజనీకాంత్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి ఒకటి రోబో 2.0  అయితే మరొకటి కాలా సినిమా. అయితే తాజాగా రజనీకాంత్ మరో సినిమా చేస్తున్నారన్న వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది…ఈ వార్తతో రజనీకాంత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
రజనీ హీరోగా .. కార్తీక్ సుబ్బరాజ్ (పిజ్జా ఫేం) దర్శకత్వంలో తమ తదుపరి సినిమా ఉంటుందని, తాజాగా సన్ పిక్చర్స్ వారు ఒక ప్రకటన చేశారు. సన్ పిక్చర్స్ వారి సినిమా అంటే అది ఎంతటి భారీస్థాయిలో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. కొన్ని సినిమాలు మాత్రమే చేసినా .. వాటిలో వైవిధ్యం కారణంగా, కార్తీక్ సుబ్బరాజ్ లోని ప్రతిభ కారణంగా ఈ ఛాన్స్ ఆయనకి దక్కింది..ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి అంటున్నారు కోలీవుడ్ జనం. ప్రస్తుతం రజనీకాంత్ సినిమా కాలా  సినిమా విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here