ప్రభాస్ తో ప్రముఖ కొరియోగ్రాఫర్ సినిమా?

బాహుబలి సినిమా విజయంతో దేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని సినిమా ప్రేక్షకుల కళ్ళ ను తనవైపు తిప్పుకునేలా చేసుకున్న హీరో ప్రభాస్…తన తర్వాత సినిమా విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు బాహుబలి ఏ స్థాయిలో విజయం సాధించిందో అదే స్థాయిలో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు ప్రభాస్. ఈ సందర్భంగా ప్రభాస్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం.

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేస్తూ ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్ విదేశాల్లో జరుగుతుంది. అయితే ఈ క్రమంలో మధ్యలో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్..జిల్ దర్శకుడు రాధాకృష్ణతో మరో సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ కొరియోగ్రాఫర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాలనే యోచనతో ఓ సూపర్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకుని ప్రభాస్ కు వినిపించే పనిలో ఉన్నాడట.

ఆయన మరెవరో కాదు రాజు సుందరం. డాన్స్ మాస్టర్ గా స్టార్ హీరోలతో పనిచేసే రాజు సుందరం ప్రభాస్ తో సినిమా చేయాలనీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు…ఈ సందర్భంగా ప్రభాస్ కి స్టోరీ వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడు రాజు సుందరం. ప్రస్తుతం ప్రభాస్ దుబాయిలో సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here