ఎన్టీఆర్ బయోపిక్ కన్నా ముందే మరొక సినిమా

ఇటీవల జై సింహ సినిమా సంక్రాంతికి వచ్చి భారీ హిట్ కొట్టిన బాలకృష్ణ వెంటనే తన తండ్రి జీవితం ఎన్టీ రామారావు సినిమాను తెరకెక్కించడానికి రెడీ అయిపోయారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ సినిమా టైటిల్ గా చిత్రీకరించడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకి దర్శకుడు నటీనటుల ఎంపిక మరియు ఎన్టీ రామారావు గురించి సమాచారం సేకరించడానికి సమయం పడుతున్న నేపథ్యంలో…బాలకృష్ణ వేరే సినిమా చేయడానికి సిద్ధమైపోయాడు.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ తో చేయడానికి రెడీగా ఉన్నారట బాలకృష్ణ …అయితే ఈ క్రమంలోనే సి. కళ్యాణ్  బాలకృష్ణ తో సినిమా చేయడానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ను కలిసినట్లు తెలుస్తోంది. మాస్ యాక్షన్ నేపథ్యం కలిగిన సినిమాలను తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు….ప్రస్తుతం వరుస విజయాల మీద ఉన్నాడు డైరెక్టర్..అందువలన ఆయనను ఒప్పించడానికి సి.కల్యాణ్  ప్రయత్నిస్తున్నాడట. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి. అయితే ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా బయటికి రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here