జగన్ పాదయాత్రలో ఇతర రాష్ట్ర ప్రజలు!

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ పక్ష నేత వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్రంలో అనేక సంచలనాలు సృష్టిస్తుంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర ప్రకాశంజిల్లా కనిగిరి లో జరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రజలు జగన్ కి  బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాకుండా జగన్ తన పాదయాత్రలో ప్రతి ఒక్కరినీ పలకరించుకుంటూ వారి సమస్యలని వింటూ వారికి ధైర్యం చెప్తూ ముందుకు సాగుతున్నారు. జగన్ వెళ్లిన ప్రతిచోటా చంద్రబాబునాయుడు మీద వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది.

ఏ క్రమంలో జగన్ చేస్తున్న పాదయాత్ర నిర్మాణానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తున్నారు…ప్రజలు భారీ సంఖ్యలో జగన్‌ వెంట కదిలారు. ‘ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌ నిరంతరం శ్రమిస్తున్నాడని తెలుసుకొని పూణే నుంచి వచ్చాం. జననేత జగన్ వెంట నడవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అది మేము మా కళ్లతో చూశాము. మేము అడుగులో అడుగు వేశాం.

ఇలాగే ఈ పాదయాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాం’ అని ఆ రాష్ట్ర వాసులు తెలిపారు….అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో జగన్ కచ్చితంగా సీఎం అవుతారని చెప్పారు..చంద్రబాబునాయుడు గతంలో చెప్పిన వన్నీ అబద్దాలేనని ఈసారి అది నిజమైందని, మరోసారి చంద్రబాబునాయుడు చెప్పే మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here