రజినీకాంత్ దువ్వెన బయటకి తీయగానే మొత్తం రచ్చ రచ్చ :

గత కొన్ని రోజులుగా తన ఫాన్స్ ని కలుస్తూ ఫారికి సంతోషం పంచుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఉదయం నుంచీ వారితో స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడుతున్నారు రజినీకాంత్. దాదాపు ఆరొందల నుంచి ఏడొందల వరకూ అభిమానులు రజినీకాంత్ తో ఉండడం విశేషం. ఇవాళ ఫోటో సెషన్ కి ముందర తనదైన స్టైల్ లో దువ్వెన తీసి దువ్వుకున్న రజినీకాంత్ ని చూసి ఫుల్లుగా కేరింతలు కొట్టారు ఫాన్స్. రజినీకాంత్ కి పూర్తి బట్టతల అయినా కూడా ఫోటోలకి ముందర ఫాన్స్ కోసం అలా ఒక్కసారి తల దువ్వేసారు.
దీంతో ఆయన ప్రసంగిస్తున్న రాఘవేంద్ర కళ్యాణ మండపం మొత్తం హోరెత్తింది. అయితే ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు మరి . కమలం గుర్హ్టు మీద బాబా సింబల్ తో ఆయన పెట్టె కొత్త పార్టీ గురించి అనేక ఊహాగానాలు సాగుతున్న నేపధ్యం లో రజిని కాంత్ ప్రసంగం చాలా మందిని అకాట్టుకుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here