నంద్యాల టికెట్టు కోసం వైకాపా లో తీవ్ర పోటీ … జగన్ మనసులో ఏముంది ?

నంద్యాల ఉప ఎన్నిక కేవలం టీడీపీ లో మాత్రమె కాదు వైకాపా లో కూడా తీవ్ర అలజడి రేపుతోంది. టీడీపీ టికెట్ కోసం భూమా నాగిరెడ్డి కుటుంబం తో పాటు శిల్పా  మోహన్ రెడ్డి కూడా కాంపిటేషన్ లో ఉండగా వైకాపా టికెట్ మీద కూడా పెద్ద పోటీ జరుగుతోంది. పార్టీ ఇన్ ఛార్జ్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టికెట్ తనకే వస్తుందనే భావనతో ఉన్నారు. ఆయన సన్నిహితులు, అనుచరులు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని ఘటన జరిగింది. నంద్యాల మాజీ ఎంపీ ప్రతాప రెడ్డి వైకాపా అధినేత జగన్ తో కలిసి మాట్లాడారు.

దాదాపు గంటన్నర వీరిద్దరి మధ్యన మంతనాలు సాగాయి. వైకాపా లో ప్రతాప రెడ్డి చేరడం ఓకే అయినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికలో గంగులను బరిలోకి దించేందుకు వైసీపీ సన్నాహకాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. మరొక పక్క మల్లి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ టికెట్టు మీద ఆశలు పెట్టుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here