సమంత లో ఆ విషయం నాకు నచ్చదు :

తన ప్రియురాలు , కాబోయే భార్య సమంత గురించి ఆమె లాగా ఓపెన్ గా మాట్లాడడానికి పెద్దగా ఇష్ట పడని చైతన్య ఈ సారి వెరైటీ గా ఆమె మీద చిలిపి ఫిర్యాదు చేసాడు. ” రారండోయ్ వేడుక చూద్దాం ” సినిమా ప్రమోషన్ కోసం ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా పర్సనల్ విషయాలు మాట్లాడ్డం తనకి ఇష్టం ఉండదు అని చెప్పుకొచ్చారు.  అయితే తాను సమంతను కలిసిన ప్రతిసారీ తనను విపరీతంగా ఫోటోలు తీస్తుందని చెప్పాడు. ‘పోనీ ఫోటోలు తీసినది ఊరుకుంటుందా? అంటే ఊరుకోదు… సోషల్ మీడియాలో పెట్టేస్తుంటుంది.

దీంతో వాటిని చూసిన వారంతా నన్ను వాటి గురించి అడుగుతుంటారు. ఏడిపిస్తూ ఉంటారు కూడా. నేనేమో సైలంట్ గా ఉంటాను ” అన్నాడు . పెళ్ళికి ముందు అనుభూతులు మనసులో ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు చైతూ .. పెళ్లికి ముందు ఈ సెలబ్రేషన్స్, మూవ్ మెంట్స్, ఎమోషన్స్, అటాచ్ మెంట్ మళ్లీ మళ్లీ వచ్చేవి కాదని, లైఫ్ టైమ్ ఎక్స్ పీరియెన్సెస్ అని నాగచైతన్య తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here