బాహుబలి రైటర్ .. మురుగదాస్ డైరెక్టర్ .. రోబో ప్రొడ్యూసర్ .. విజయ్ హీరో .. క్రేజీ ప్రాజెక్ట్ :

వందకోట్ల బడ్జెట్ పెట్టి బాలీవుడ్ వాళ్ళు కూడా సినిమాలు తీయలేకపోయిన రోజుల్లో నూట యాభై కోట్ల బడ్జెట్ పెట్టి సన్ పిక్చర్స్ రోబో సినిమా తీసి పారేసింది. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా ఆ సంస్థ డీఎంకే పార్టీ కి చాలా క్లోజ్ అనేది అందరికీ తెలిసిందే. ఆర్ధికంగా బాగా దెబ్బతినేసింది. అంతా జరిగి ఉంటె రోబో సీక్వెల్ ని వీరే తీసేవారు. లైకా ప్రొడక్షన్స్ వాళ్లు ఆ ప్రాజెక్టును టేకప్ చేశారు. తమ స్టైల్ లో రీ ఎంట్రీ ఇవ్వడం కోసం సన్ పిక్చర్స్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పుడు తుపాకీ – కత్తి లాంటి సినిమాలు తీసిన కాంబినేషన్ విజయ్ – మురుగదాస్ లతో సన్ పిక్చర్స్ మళ్ళీ రాబోతోంది

.ప్రస్తుతం మహేష్ బాబుతో ‘స్పైడర్’ చేస్తున్న మురుగదాస్.. ఆ తర్వాత చేయబోయే సినిమా విజయ్‌తోనే. మురుగదాస్ ఫ్రీ అయ్యే సమయానికి అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను ముగించేయడానికి ప్రయత్నిస్తున్నాడు విజయ్. ఈ కొత్త సినిమాకి కథ విజయేంద్ర ప్రసాద్ ఇవ్వబోతున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here