నిశిత్ నారాయ‌ణ కారును చూసి షాక్ తిన్న బెంజ్ ప్రతినిధులు

రోడ్డు ప్ర‌మాదంలో  ఏపీ మంత్రి నారాయ‌ణ కొడుకు నిశిత్ నారాయ‌ణ మృతి చెందిన విష‌యం తెలిసిందే.  ఈ ప్ర‌మాదంలో వాడిన బెంజ్ కారు ను చూసిన‌ ఆ సంస్థ ప్ర‌తినిధులు షాక్ తిన్న‌ట్లు తెలుస్తోంది.
మే 10వ తేదీ తెల్ల‌వారు జామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌ర్ 36 మెట్రో పిల్ల‌ర్ ను ఢొకొని 10నిమిషాల వ్య‌వ‌ధిలో నిశిత్ నారాయ‌ణ‌, అత‌ని ఫ్రెండ్ రాజారవీంధ్ర క‌న్నుమూశారు. రూ2కోట్ల విలువ‌గ‌ల అత్యాధునిక ప్ర‌మాణాల‌తో తాయ‌రు చేసిన ఈ బెంజ్ పిల్ల‌ర్ ఢీకొట్ట‌డం తో ఇంజిన్ పూర్తి భ‌య‌ట‌కి వ‌చ్చిన‌ట్లు స్థానికులు తెలిపారు.

అంతేకాదు ప్ర‌మాద‌స్థాయిని అంచానా వేస్తే కారుకున్న బెలూన్లు, సుర‌క్షిత ప్ర‌మాణాలు ప్రాణాల్ని నిల‌బెట్ట‌లేక‌పోయాయి. అయితే అత్యంత ఖరీదైన కారు ఎలా డ్యామేజీ అయ్యింది. ప్ర‌మాదాన్ని గుర్తించి ఎందుకు కాపాడ‌లేక‌పోయింది లాంటి ప్ర‌శ్నల్ని సంధిస్తూ వాటికి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని బెంజ్ సంస్థ ప్ర‌తినిధుల్ని హైదార‌బాద్ పోలీసులు కోరారు. ఈనేప‌థ్యంలో జ‌ర్మ‌నీని నుంచి  వ‌చ్చిన బెంజ్ ప్ర‌తినిధులు  బోయిన్‌ప‌ల్లిలో ఉన్న బెంజ్ స‌ర్వీస్ సెంట‌ర్ లో  ప్ర‌మాదానికి గురైన కారును చూసి అవాక్ అయ్యార‌ట‌.

త‌మ కంపెనీకి చెందిన కారు డ్యామేజీ అవ్వ‌డం, అందులో ప్రాణాలు పోవ‌డంపై విస్మ‌యానికి గురైన బెంజ్ యాజ‌మాన్యం మ‌రో 7 రోజుల‌కు రిపోర్టును ఇవ్వ‌నున్న‌ట్లు పోలీసుల‌కు తెలిప‌న‌ట్లు స‌మాచారం. అంత‌టి డేంజ‌ర‌స్ యాక్సిడెంట్ కాబ‌ట్టే బెంజ్ ప్ర‌తినిధుల‌ను అది ఇక్క‌డి దాకా ర‌ప్పించింది. మ‌రి వారు రిపోర్టు ఏమ‌ని ఇస్తారో వేచి చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here