తమిళనాడు కి కాబోయే ముఖ్యమంత్రి రజినీకాంత్ !

ఒకే సారి రెండు రకాల డిస్కషన్ లు సాగుతున్నాయ్ .. తలైవా రజినీకాంత్ రాజకీయ పార్టీ పెడుతున్నారు అనీ మరొక పక్క బీజేపీ తో పాటు అనేక పార్టీలు ఆయన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి అనీ. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తుండగా అనేక ఊహాగానాలు వినపడుతున్నాయ్. ఈ నెల 15 నుంచీ ఫాన్స్ తో మాట్లాడుతున్న రజినీకాంత్ త్వరలో అఫీషియల్ గా ఈ విషయం ప్రకటిస్తారు అని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రజనీకాంత్ జాతకాన్ని ఆయన సన్నిహితుడొకరు కేరళలోని ప్రముఖ జ్యోతిష్యుడికి చూపించగా, రజనీకి రాజకీయాలు బాగా కలిసి వస్తాయని, ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతారని చెప్పారట. రేపే ఆయన రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటన రావచ్చు అంటున్నారు. రజిని యొక్క బాబా సింబల్ తో పాటు దాని మీద కమల సింబల్ ఉండేలా ఈ గుర్తు ఉంటుంది అంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here