దిల్ రాజు తో కెసిఆర్ డిన్నర్ .. ఏంటి సంగతి ?

జాతీయ అవార్డుల ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం తెలుగు చిత్రాలు శతమానం భవతి , పెళ్లి చూపులకి జాతీయ అవార్డులు ఇచ్చింది. ఈ నేపధ్యం లో మర్యాద పూర్వకంగా కెసిఆర్ ని కలిసారు నిర్మాత దిల్ రాజు , హీరో శర్వా నంద్ . ఈ టీం ని కెసిఆర్ స్పెషల్ గా ప్రశంసించారు. మంచి చిత్రం నిర్మించారు అనీ మరిన్ని సినిమాలు ఇలాంటివే తీయాలి అంటూ దిల్ రాజు ని ప్రైజ్ చేసారు ఆయన. ఫేస్ బుక్ ద్వారా శర్వానంద్ ఈ విషయం తెలియజేసారు.జాతీయ అవార్డు ని గెలుచుకున్నందుకు టీం మొత్తం తో చాలా సేపు స్పెండ్ చేసిన కెసిఆర్ వారితో డిన్నర్ కూడా చేసారు అని సమాచారం.

డిన్నర్ టైం లో ఆ సినిమా గురించీ దిల్ రాజు బొమ్మరిల్లు సినిమా గురించీ బోలెడు విషయాలు అడిగినట్టు సమాచారం. శర్వా కెరీర్ గురించి కూడా కెసిఆర్ మాట్లాడారని అంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here