విషమంగా హీరో రాజశేఖర్‌ ఆరోగ్యం..!

కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇటీవల చాలా మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల హీరో రాజశేఖర్ కుటుంబమంతా కరోనా బారిన పడింది. జీవితతో పాటు ఇద్దరు కూతుళ్లకు కూడా కరోనా సోకింది. అయితే కుటుంబంలో అందరూ కరోనా నుంచి కోలుకోగా రాజశేఖర్‌ ఒక్కరే ఇంకా కోవిడ్‌ నుంచి బయటపడలేదు.

అయితే తాజాగా రాజశేఖర్‌ ఆరోగ్యం విషమంగా మారినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన కూతురు శివాత్మిక స్వయంగా తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ చేస్తూ..‘ప్రియమైన వారందరికీ.. కోవిడ్‌తో నాన్న పోరాటం చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ ఆయన గట్టిగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమే మమ్మల్ని కాపాడాయని మేము నమ్ముతున్నాము, నాన్న కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని కోరుతున్నాను. మీ ప్రేమాభిమానాలతో నాన్న బలంగా తిరిగి బయటకు వస్తాడు’ అని శివాత్మిక చేసిన పోస్ట్‌ భావోద్వేగానికి గురిచేస్తుంది. రాజశేఖర్‌ త్వరగా ఆరోగ్యం నుంచి కోలుకోవాలని మనమూ ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here