రాజకీయం గురించి రజినీకాంత్ ఓపెన్ ఐన మాట

రాజకీయాల్లోకి రావాలంటే పేరు, హోదా ఉంటే చాలదని, అంతకంటే ఎక్కువ అర్హతలే ఉండాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ప్రముఖ నటుడు కమలహాసన్ తన సొంత పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రజనీ పైవిధంగా స్పందించారు. కాగా, ‘రోబో 2.0’ ఆడియో వేదిక రెండు రోజుల క్రితం దుబాయ్ లో గ్రాండ్ గా జరిగిన విషయం విదితమే.
‘తీరని కోరిక ఒకటి ఉంది., ఏం జరుగుతుందో చూడాలి’ అని ఈ వేడుకలో పాల్గొన్న రజనీ వ్యాఖ్యానించారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. రాజకీయాల్లోకి తన రంగప్రవేశం గురించి రజనీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు చిత్రవర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here