ఆల్లూ అర్జున్ సినిమా గురించి నాగబాబు అప్డేట్

అల్లు అర్జున్ తాజా చిత్రంగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తెరకెక్కుతోంది. శిరీషా శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, ఇది బన్నీ బాడీ లాంగ్వేజ్ కి కరెక్ట్ గా సెట్ అయిన కథ అని అన్నారు. ఈ సినిమాకి వక్కంతం వంశీ అందించిన కథా కథనాలు అద్భుతమని చెప్పారు.
నవంబర్ 5వ తేదీ నుంచి హైదరాబాద్ లో మేజర్ షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుందని అన్నారు. నెలరోజుల పాటు నాన్ స్టాప్ గా ఈ షెడ్యూల్ కొనసాగుతుందనీ, అందుకోసం బన్నీ రెడీ అవుతున్నాడని చెప్పారు. ముఖ్యంగా ఈ షెడ్యూల్ లో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నామనీ, ఇవి ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అన్నారు. యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా, బన్నీ ఫ్యాన్స్ అంచనాలకి తగినట్టుగా ఉంటుందని చెప్పుకొచ్చారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here