మహేష్ బాబు తో సై అని పోటీ కి సిద్దమైన అల్లూ అర్జున్

అల్లు అర్జున్ హీరోగా తాను నిర్మిస్తున్న ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలను ‘ఖుషీ’ చిత్రం విడుదలైన ఏప్రిల్ 27న విడుదల చేయాలని ముందే నిర్ణయించి ప్రకటించేశామని, ఇప్పుడు అదే రోజున దానయ్య నిర్మాతగా మహేష్ హీరోగా తయారవుతున్న ‘భరత్ అను నేను’ (ప్రచారంలో ఉన్న టైటిల్) విడుదలవుతుందని తెలిసి షాక్ తిన్నామని నిర్మాత బన్నీ వాసు అన్నాడు.
ఇప్పుడు తాము వెనక్కు తగ్గితే మహేష్ చిత్రానికి భయపడ్డామని అంటారు కాబట్టి వెనక్కు వెళ్లే పనే లేదని అన్నాడు. మహేష్ సినిమా విడుదల గురించి దానయ్య ముందే చెప్పుంటే తాము ఆలోచించి వుండేవాళ్లమని, తమను అడగకుండా ఆయన రిలీజ్ తేదీని చెప్పడంతో బాధపడ్డామని అన్నాడు. గతంలో రాజమౌళి ‘ఈగ’ కోసం తన ‘జులాయి’ని మూడు వారాలు వెనక్కు జరిపామని గుర్తు చేశారు. కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకునేందుకు దానయ్యను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here