అల్లూ అరవింద్ కీ నాకూ మగధీర టైం నుంచీ గొడవలు .. ఇంకా వైరం ఉంది – రాజమౌళి సంచలన వ్యాఖ్యలు

బాహుబలి సినిమా ఇవాళ ప్రపంచానికి తెలుగు సినిమా ఖ్యాతిని తెలియజేసింది. ఈ చిత్రం గొప్పతనం గురించి రాజమౌళి ఎన్ని మాటలు చెప్పినా అతని అసలు ప్రస్థానం మగధీర సినిమాతోనే మొదలైంది అని చెప్పాలి. మగధీర ద్వారా రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి ఒక రేంజ్ కి ఎదిగాడు హీరో రామ్ చరణ్. ఆ టైం లో మెగా ఫామిలీ రాజమౌళి ని తొక్కేసే ప్రయత్నాలు చేసింది అన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి అందాల్సినంత గౌరవం అందలేదనే టాక్ సర్వత్ర ఉంది. ఈ విషయానికి సంబంధించి రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. చాలా సంవత్సరాల క్రితమే ముగిసిపోయిన ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించారు రాజమౌళి.

మగధీర విషయం లో అల్లూ అర్జున్ కి తనకీ మధ్య చాలా గొడవలు జరిగాయి అనీ అందుకే 100 రోజుల ఫంక్షన్ కు కూడా రాలేనని చెప్పినట్టు తెలిపాడు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విషయాన్ని తెలిపాడు. అప్పటి నుంచీ ఉన్న పుకారులు నిజమే అని వైరం ఇంకా నడుస్తోంది అన్నట్టు మాట్లాడాడు మౌళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here