ప్లేటు ఫిరాయించిన బీజేపీ .. ఉద్యోగాల విషయం లో తోక వంకర.

దేశం లో ఉన్న మొత్తం నూట ఇరవై కోట్ల జనాభా కీ ఉద్యోగాలు ఏర్పాటు చెయ్యడం జరిగే పనే కాదు అని తేల్చి చెప్పేశారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. దానికి ఎన్డీఏ ప్రభుత్వం స్వయం ఉపాది వైపు యువతని నడిపిస్తోంది అన్నారు ఆయన. ” మన దేశం లో ఇప్పటి దాకా మోడీ ప్రభుత్వం లాంటి పారదర్సక పాలన ఎన్నడూ ఎవ్వరూ చూడలేదు . మూడేళ్ళ పాలనలో ఒక్కటంటే ఒక్క కుంభకోణం కూడా జరగలేదు. కుటుంబ పాలననీ కుల రాజకీయాలనీ ఫుల్ స్టాప్ పెట్టిన ఘనత మాది. గత ప్రభుత్వాల హయాంలో అంతులేని అవినీతి ఉండేది. ఇప్పుడంతా మన రాజ్యం. ” అన్నారు షా.

కాంగ్రెస్ ప్రభుత్వం లాంటి తుచ్చమైన పాలన నుంచి జనం విముక్తి పొందారు అనీ త్వరలో ఇంకా గొప్ప భారతాన్ని చూస్తారు అన్నారు ఆయన. అయితే ఉద్యోగాల విషయం లో బీజేపీ ఎలక్షన్ కి ముందు ఒక మాట తరవాత ఒక మాట మాట్లాడడం చాలా బాధాకరం అంటున్నారు విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here