రాజమౌళి, కీర‌వాణిల సంచ‌ల‌న నిర్ణ‌యం

క‌రోనా మ‌హ‌మ్మారి విష‌యంలో ఎవ్వ‌రూ నిర్ల‌క్ష్యంగా ఉండ‌కూడ‌ద‌ని ప్రముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అన్నారు. డాక్ట‌ర్లు చెప్పిన విధంగా అంద‌రూ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. సైబ‌రాబాద్ క‌మీష‌న‌రేట్ ప‌రిధిలో ప్లాస్మా దానంపై జరిగిన అవ‌గాహ‌నా స‌ద‌స్సులో పాల్గొని మాట్లాడారు.

క‌రోనా జాగ్ర‌త్త‌లు, ప్లాస్మా దానంపై ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న తెచ్చేందుకు రాజ‌కీయ నాయ‌కులు, పోలీసులు, సినీన‌టులు త‌మ‌దైన శైలిలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. మొన్న చిరంజీవి వాయిస్ ఇచ్చి ప్ర‌జ‌ల్లో ధైర్యం నింపే ప్ర‌య‌త్నం చేశారు. నేడు రాజ‌మౌళి త‌న వంతుగా ప్ర‌జ‌ల‌కు సందేశం ఇచ్చారు.

అవ‌గాహ‌న స‌ద‌స్సుల్లో సిపి సజ్జ‌నార్‌తో పాటు రాజ‌మౌళి, కీర‌వాణి పాల్గొని మాట్లాడారు. క‌రోనాను జ‌యించిన వారు ప్లాస్మా దానం చేయాల‌న్నారు. క‌రోనా ల‌క్ష‌ణాలుంటే వెంట‌నే టెస్టులు చేయించుకోవాల‌న్నారు. అన‌వ‌స‌ర భ‌యం పెట్టు్కోకుండా ఆరోగ్యంగా ఉండాల‌న్నారు. క‌రోనా ఉన్న‌ట్లు తేలితే వెంట‌నే త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే స‌రిపోతుంద‌న్నారు.

క‌రోనాను జ‌యించిన రాజ‌మౌళి ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని సీపీ స‌జ్జ‌నార్ అన్నారు. ప్లాస్మా దానం చేయ‌డానికి త‌మ కుటుంబ సిద్ధంగా ఉంద‌ని కీర‌వాణి అన్నారు. ప్లాస్మా దానం కార్య‌క్ర‌మంలో యువ‌త‌, స్వ‌చ్చంద సంస్థ‌లు, ఇత‌ర ఉద్యోగుల పాత్ర చాలా కీల‌కంగా ఉంద‌న్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here