వందేళ్ల‌లో ఇదే పెద్ద ఆర్థిక సంక్షోభం..చంద్ర‌బాబు

తెలుగుదేశం పార్టీ నేత‌ల‌తో ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిస్థితులు, విజృంభిస్తున్న క‌రోనా త‌దిత‌ర అంశాల‌పై ఆయ‌న నేత‌ల‌తో మాట్లాడారు.

క‌రోనా రోజురోజుకూ ఎక్కువ‌వుతోంద‌ని చంద్ర‌బాబు నాయ‌కుల‌తో అన్నారు. త‌న జీవితంలో ఇలాంటి ప‌రిస్థితులు ఎప్పుడూ చూడ‌లేద‌ని వ్యాఖ్యానించారు. కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న నెల‌కొంద‌న్నారు. ఎలాంటి విపత్క‌ర ప‌రిస్థితులు ఉన్నా వైద్యులు మాత్రం బాగా ప‌ని చేస్తున్నార‌ని ఆయ‌న కొనియాడారు. వందేళ్ల‌లో ఎప్పుడూ లేని ఆర్థిక సంక్షోభం ఏర్ప‌డింద‌న్నారు.

క‌రోనా వ‌ల్ల భ‌యాన‌క స్థితి ఏర్ప‌డింద‌న్నారు. త‌న జీవితంలో ఇన్ని రోజులు ఖాలీగా ఉండ‌టం ఇదే మొద‌టిసారి అని బాబు పేర్కొన్నారు. ఇక క‌రోనా పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు రోగ‌నిరోధ‌క‌శ‌క్తి పెంచుకోవాల‌న్నారు. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయ‌న్నారు. చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో స‌మావేశంలో ఇంకా ఏఏ అంశాల‌పై చ‌ర్చించార‌న్న‌ది తెలియ‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here