ఐపీఎల్‌లో డ్రీమ్ 11 అనూహ్య ఎంట్రీ..

క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న ఐపిఎల్ స్పాన్స‌ర్ షిప్ ను డ్రీమ్ 11 అనే కొత్త సంస్థ సొంతం చేసుకుంది. వీవో త‌ప్పుకున్న త‌ర్వాత  ఎవ‌రు ముందుకొస్తార‌న్న ఊహాగానాల నేప‌థ్యంలో అనూహ్యంగా డ్రీమ్ 11 వ‌చ్చేసింది.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ స్పాన్స‌ర్‌షిప్ నుంచి వివో త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. భార‌త్‌, చైనా మ‌ధ్య నెల‌కొన్న వివాదం కార‌ణంగా చైనా మొబైల్ కంపెనీ వివో ఐపిఎల్ స్పాన్స‌ర్‌షిప్ నుంచి వైదొలిగింది. అయితే వివో లేని స్థానాన్ని ఎవ‌రు బ‌ర్తీ చేస్తార‌నుకుంటున్న త‌రుణంలో బ‌‌రిలో  బైజూస్‌, జియో, అమేజాన్‌, కోకాకోలా  ,  ప‌తంజ‌లి ముందుకు వ‌చ్చాయి.

అయితే వీట‌న్నింటినీ కాద‌ని డ్రీమ్ 11 సంస్థ వీవో స్పాన్స‌ర్‌షిప్ ద‌క్కించుకోవ‌డం ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. డ్రీమ్ 11 సంస్థ రూ. 222 కోట్లు చెల్లించేందుకు ముందుకు వ‌చ్చింది. దీంతో బీసీసీఐ ఓకే చేసేసింది. కాగా ఐపిఎల్ ప్ర‌ధాన స్సాన్సర్‌గా ఉన్న స‌మ‌యంలో వీవో  బీసీసీఐకి సంవ‌త్స‌రానికి రూ. 440 కోట్లు చెల్లించేది. ఈ సారి కూడా క‌నీసం రూ. 250 నుంచి 300 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు స్పాన్స‌ర్‌షిప్ రాబ‌ట్టాల‌ని బీసీసీఐ అనుకుంది. చివ‌ర‌కు డ్రీమ్ 11 కే ప‌ట్టం క‌ట్టింది. మ‌రి ఈ ఒప్పందానికి సంబంధించి పూర్తి వివ‌రాలు ఇంకా రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here