పార్ల‌మెంటు ప్రారంభానికి ముందే సెటైర్లు మొద‌లెట్టిన రాహుల్ గాంధీ..

కాంగ్ర‌స్ నేత రాహుల్ గాంధీ పార్ల‌మెంటు స‌మావేశాల‌కు ముందే మాట‌ల దాడి ప్రారంభించారు. నేటి నుంచి పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. దీంతో మోదీ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఇండియాలో క‌రోనా విజృంభిస్తోంద‌న్నారు. ఈ వారంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 50 ల‌క్ష‌ల దాట‌నుంద‌న్నారు. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో ప్ర‌భుత్వం పూర్తి విఫ‌లం అయ్యింద‌ని.. దీని ఫ‌లితం ప్ర‌జ‌లు అనుభ‌విస్తున్నార‌న్నారు. ప్ర‌ధాని మోదీ అహంకారం వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని రాహుల్ త‌ప్పుబట్టారు.
ఓ ప్ర‌ణాళిక లేకుండా దేశంలో లాక్‌డౌన్ విధించార‌న్నారు. దీంతో కేసుల సంఖ్య పెరిగిపోతోంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో మోదీని ఎద్దేవా చేసిన‌ట్లు మాట్లాడారు.

మోదీ ప్ర‌భుత్వం చెప్పే ఆత్మ‌నిబ్బ‌రం అంటే ఏమిటో తెలుసా.. ప్ర‌ధాని మోదీ నెమ‌ళ్ల‌తో ఆడుకుంటుంటే మ‌రోప‌క్క మీరు మీ ప్రాణాలు కాపాడుకోవ‌డం అని ట్విట్ట‌ర్‌లో ఆయ‌న ఎద్దేవా చేశారు. ఇటీవ‌ల కాలంలో మోదీ ప్ర‌భుత్వంపై రాహుల్ గాంధీ త‌న‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మొన్న యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా స్పందించారు. చైనా ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూడా యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారా అని వ్యంగాస్త్రాలు సంధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here