‘మహా సముద్రం’లో ఐశ్వర్య..

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకుడు అజయ్ భూపతి తన తర్వాతి చిత్రాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మహా సముద్రం పేరుతో తెరకెక్కించనున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నట్లు అజయ్ భూపతి ఇటీవల స్వయంగా తెలిపాడు. ఇంటెన్సివ్ లవ్ స్టోరీ కథాంశంతో సినిమా తెరకెక్కనున్నట్లు అజయ్ సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాలో శర్వానంద్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటించనుందని సమాచారం. ఇప్పటికే కథ విన్న ఐశ్వర్య… సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అత్యధిక ప్రాధాన్యత ఉండనుందట. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను తెలుగు తమిళంలో ఏకకాలంలో తెరకెక్కించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here