చైనా ధాటికి భ‌య‌ప‌డి భార‌త సైనికులు సిక్ లివ్‌లో వెళుతున్నారా.. ?

బోర్డ‌ర్‌లో ఇండియా చైనా మ‌ధ్య నెల‌కొన్న వివాదం తీవ్ర‌మ‌వుతూనే ఉంది. కొన్ని నెల‌లుగా స‌రిహ‌ద్దులో చైనా ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌వైపు చ‌ర్చ‌లు జ‌రుగుతూనే మ‌రోవైపు చైనా త‌న వ‌క్ర‌బుద్దిని చాటుతూ స‌రిహ‌ద్దులో సైన్యాన్ని, ఆయుధాల‌ను దింపుతూనే ఉంది.

ఈ ప‌రిస్థితుల్లో స‌రిహ‌ద్దులో ఉన్న సైన్యం సిక్‌లివ్ పెట్టి వెళుతున్నారంట‌. ఇందుకోసం 80వేల మంది భార‌త సైనికులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారంట‌. 45 ఏళ్లలో ఇంత పెద్ద సంఖ్య‌లో సైనికులు సిక్ లివ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఇదే మొదటి సారి. అంటూ ప‌లు వార్త‌లు సోషల్ మీడియాలో ఎక్కువ‌గా వ‌స్తున్నాయి.

దీనిపై ప్రెస్ ఇన్మ‌ఫ్మేష‌న్ బ్యూరో స్పందించింది. సోష‌ల్ మీడియాలో భార‌త సైన్యంపై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అవాస్త‌వాల‌ని తెలిపింది. సైనికులు ఎవ్వ‌రూ సిక్ లివ్ పెట్టలేద‌ని సైనిక వ‌ర్గాలు కూడా చెప్పాయి. ఇలాంటి అవాస్త‌వ‌మైన వార్త‌ల ప‌ట్ల ఎప్ప‌టిక‌ప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉండాలని భార‌త భ‌ద్ర‌తా ద‌ళాలు స్ప‌ష్టం చేశాయి. స‌రిహ‌ద్దులో రోజురోజుకూ ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారుతూనే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ చైనాను ఎదుర్కొనేందుకు భార‌త సైన్యం ఎప్పుడూ రెడీగానే ఉంది. చైనాను ఎదుర్కొనే శ‌క్తి భార‌త సైన్యానికి ఉందన్న విష‌యాన్ని ఇది వ‌ర‌కే స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here