బాలయ్య సినిమాలో అల్లరి నరేష్..?

బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న మూడో సినిమా కావడంతో దీనిపై ఇప్పటినుంచే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైనా…  లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. అయితే చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ అక్టోబర్ నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుందని సమాచారం.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే కీలకమైన పాత్రలో నరేష్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు నవీన్ చంద్ర.. కళ్యాణ్ రామ్ తదితర హీరోల పేర్లు వినిపించినా ఏవీ ఖరారు కాలేదు. ప్రస్తుతం అల్లరి నరేష్ ను ఈ పాత్ర కోసం సంప్రదించారని సమాచారం. ఈ విషయంపై స్పష్టత రావాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాలి. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2021 వేసవి కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here