క్లాస్ లుక్ లో… మాస్ మహారాజా..!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి అగ్ర హీరోల సరసన ఒకరిగా నిలిచాడు మాస్ మహారాజా రవితేజ. తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాందించుకున్న రవి తేజ…  నేటితరం హీరోలకు సైతం పోటీనిస్తున్నాడు. ఇదిలా ఉంటే రవితేజ తాజాగా ‘క్రాక్’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

సినిమాలతోనే కాకుండా తన అందంతోనూ యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు రవితేజ. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా రవితేజ పోస్ట్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. సముద్రపు ఒడ్డున కళ్లకి గ

గాగుల్స్, చేతిలో గొడుగుతో స్టైలిష్ లుక్ లో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ…  ‘షూటింగ్ ను ఎంతగానో మిస్ అవుతున్నాను. త్వరలోనే ‘క్రాక్’ చిత్రీకరణ తిరిగి ప్రారంభంకానుంది’ అని పోస్ట్ చేశాడు.

https://www.instagram.com/p/CFFSxwYgiLx/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here