హ‌థ్రాస్‌లో ఎంట‌ర్ అయిన రాహుల్ గాంధీ.. ఏం జ‌రుగుతుందో టెన్ష‌న్ టెన్ష‌న్‌..

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్లోని హ‌థ్రాస్‌కు వెళ్లేందుకు ఆయ‌న‌కు పోలీసులు అనుమ‌తులు మంజూరు చేశారు. మొన్న ఇక్క‌డే రాహుల్‌ను అడ్డుకోవ‌డంతో ప‌రిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే నేడు రాహుల్‌తో పాటు ప్రియాంక‌కు కూడా వెళ్లేందుకు అనుమ‌తి ల‌భించింది.

రాహుల్ గాంధీ క‌చ్చితంగా హ‌థ్రాస్ వెళ్లితీర‌తాన‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న ఢిల్లీ నుంచి హ‌థ్రాస్‌కు బయ‌లు దేరారు. ఆయ‌న‌తో పాటు మ‌రో 50 మంది ఎంపీల‌ను కూడా హ‌థ్రాస్ తీసుకువెళ్తార‌ని తెలిసింది. కాగా ముందుగా ఉత్త‌ర ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దు వ‌ద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. హ‌థ్రాస్‌లో 144 సెక్ష‌న్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఎవ్వ‌రినీ అనుమ‌తించ‌మ‌ని చెప్పారు. అయితే ఆ త‌ర్వాత ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడారు.

ఫైన‌ల్‌గా రాహుల్ గాంధీతో పాటు మ‌రో న‌లుగురిని హ‌థ్రాస్ వెళ్లేందుకు అనుమ‌తులు ఇచ్చారు. దీంతో రాహుల్, ప్రియాంక‌తో పాటు ముగ్గురు నేత‌లు వెళ్ల‌నున్నారు. కాగా మొన్న ఇక్క‌డే రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకోవ‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత దేశ వ్యాప్తంగా దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. బాదితుల‌ను క‌లిసేందుకు వెళ్ల‌కుండా చేయ‌డం ఏంట‌ని బీజేపీ నేత‌లే ప్ర‌శ్నించారు. దీంతో యూపి స‌ర్కార్ వెన‌క్కు త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. ఉద‌యం మీడియాను అనుమ‌తించిన పోలీసులు ఇప్పుడు రాహుల్‌ను కూడా అనుమ‌తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here