చక్కనమ్మ చిక్కినా అందమే..!

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి కీర్తి సురేష్. మహానటి చిత్రంతో తనలోని నట విశ్వరూపాన్ని చూపించి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుందీ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా  ఉంది కీర్తి. ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేశ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో ఆమె అభిమానులను కాస్త కలవరపెడుతోంది. షూటింగ్ విరామ సమయంలో చేతిలో కాఫీ కప్పు పట్టుకొని తీసిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘కాఫీ నాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా కప్పు కాఫీ కచ్చితంగా తాగుతాను’ అనే క్యాప్షన్ ను జోడించింది.

అయితే ఈ వీడియోలో కీర్తి సన్నగా మారడంతో ఆమె అభిమానులు కంగుతిన్నారు. ఈ వీడియో చూసిన కీర్తి అభిమానులు కొందరు.. ‘ ఏంటి కీర్తి ఇలా అయిపోయావు’, ‘ కీర్తి నువ్వు బరువుగా ఉంటేనే అందంగా ఉంటావు’, చాలా సన్నగా అయ్యావు.. ఇలా మారిపోయావ్ ఏంటి’.. అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు. అయితే మరికొంతమంది మాత్రం కీర్తి సన్నగా ఉన్న కూడా అందంగా ఉందని పొగుడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here