మళ్లీ పెళ్లి సందడి.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న గొప్ప దర్శకుల్లో రాఘవేంద్ర రావు ఒకరనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. తనదైన కథా, కథనంతో సినిమాను ఆసక్తిగా తెరకెక్కించడంలో ఆయనది అందె వేసిన చేయి. అందమైన అమ్మాయిలను మరింత అందంగా చూపించడం ఒక్క రాఘవేంద్ర రావుకే దక్కుతుందనడంలలో ఎలాంటి సందేహంలేదు. ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు తాజాగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితం ఓ ఛానల్‌లో ప్రసారమైన టాక్‌ షో ద్వారా ప్రేక్షకులకు మొదటిసారి తనలోని మాటను వినిపించిన రాఘవేంద్ర రావు ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్‌ పట్టుకోనున్నారు.

తాజాగా ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. రాఘవేంద్రరావు కెరీర్‌లో, అంతెందుకు తెలుగు సినిమా చరిత్రలోనే పెళ్లి సందడికి ఎంతో ప్రత్యేకత ఉన్న విషయం తెలిసిందే. శ్రీకాంత్‌, దీప్తి భట్నాగర్‌, రవళి ప్రధాన తారరణంతో 1996లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పడీ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించే పనిలో పడ్డాడు రాఘవేంద్రరావు. ‘పెళ్లి సందడి’ మళ్లీ మొదలవ్వబోతుంది.. తారాగణం త్వరలో’ అని పేర్కొంటూ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఇక ఈ చిత్రాన్ని బాహుబలి చిత్ర నిర్మాత సంస్థ ఆర్కా మీడియా తెరకెక్కిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ జెనరేషన్‌కు తగ్గట్లు రాఘవేంద్ర రావు ‘పెళ్లి సందడి’లో ఎలాంటి మార్పులు చేయనున్నాడో చూడాలి.

https://twitter.com/Ragavendraraoba/status/1314448633635377152

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here