అమెరికాలో గే పెళ్లి.. ఇండియాలో తీవ్ర వివాదం

క‌ర్నాట‌క‌లోని కొడ‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన శ‌ర‌త్ ప‌న్నొప్ప అనే వ్య‌క్తి కాలిఫోర్నియాలో డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న సందీప్‌ని పెళ్లి చేసుకోవ‌డం ఇప్పుడు వివాదాస్ప‌ద‌మైంది. అయితే వీరిది మామూలు వివాహం కాదు. వీరు గే లు. ఈ గే జంట పెళ్లిపై క‌ర్నాట‌క కొడ‌గు జిల్లా ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈ వ్య‌క్తి ఇలా చేయ‌డం తాము అంగీక‌రించ‌డం లేదంటున్నారు.

ఈ గే పెళ్లి అయిన త‌ర్వాత ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. దీంతో కొడుగు జిల్లా ప్ర‌జ‌లు దీన్ని ఖండించారు. త‌మ ఆచారాల‌ను శ‌ర‌త్ నాశ‌నం చేశార‌ని మండిప‌డ్డారు. దీంతో ఈ వ్య‌క్తిని త‌మ సామాజిక వ‌ర్గం నుంచి వెలివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. శ‌ర‌త్ తల్లిదండ్రులు దుబాయ్‌లో ఉంటున్నారు. విష‌యం తెలిసిన వీరు దీనిపై ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా 3 ల‌క్ష‌ల మంది కొడ‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌నాభా ఉన్నారు.

విష‌యం తెలుసుకున్న వెంట‌నే మడికెరి కొడవ సమాజ ప్రెసిడెంట్‌ కేఎస్‌ దేవయ్య మాట్లాడుతూ ఈ వివాహాన్ని ఖండిస్తున్నామ‌న్నారు. తమ కులానికి శరత్‌ మచ్చ తెచ్చాడని ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఇంత‌వ‌ర‌కు శ‌ర‌త్ స్పందించ‌లేదు. ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ప్ర‌ధానంగా అడ‌వులు, ప‌ర్వ‌తాలు, న‌దులు, నీటి కాలువ‌ల వ‌ద్ద నివాసం ఉంటారు. వీరు కాఫితోట‌ల‌ను పండిస్తారు. వీరి సాంప్ర‌దాయాల‌ను ఎవ్వ‌రు అవ‌మానించినా వీరు తీవ్ర స్థాయిలో ప్ర‌తిఘ‌టిస్తారు. మొత్తానికి ఈ గే పెళ్లి వీరి స‌మాజిక వ‌ర్గంలో తీవ్ర అల‌జ‌డి సృష్టించింది. మ‌రి శ‌ర‌త్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here