ఈ ఆరు క‌చ్చితంగా ఉండాల‌ని అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చిన జ‌గ‌న్‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైద్యం అంటే గుర్తొచ్చేది ఆరోగ్య శ్రీ‌. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ పేరుతో ప్ర‌జ‌ల‌కు చేసిన మేలును ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఆరోగ్య‌శ్రీ ప‌ట్ల పూర్తి శ్ర‌ద్ద తీసుకుంటున్నారు. తాజాగా హాస్పిట‌ల్స్‌లో ఏం ఉండాలో అన్న దానిపై ఆయ‌న కీల‌క ఆదేశాలు ఇచ్చారు.

కోవిడ్‌-19 నివారణ చర్యలపై సమీక్ష జరిపిన ఆయ‌న‌.. ఆరోగ్య‌శ్రీ హాస్పిట‌ల్స్‌లో ఏ విధ‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారో అన్న‌దానిపై మంత్రులు, అధికారుల‌తో మాట్లాడారు. ఈ స‌మీక్ష‌లో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ సవాంగ్‌ హాజరయ్యారు. ఈ సంద‌ర్బంగా జ‌గ‌న్ కీలక వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తి ఆరోగ్య‌శ్రీ హాస్పిట‌ల్‌లో 6 ప్ర‌మాణాలు క‌చ్చితంగా ఉండాల‌ని ఆయ‌న ఆదేశించారు. మౌలిక వసతులు, వైద్యుల అందుబాటు, ప్రమాణాలతో కూడిన ఔషధాలు, శానిటేషన్‌, నాణ్యతతో కూడిన ఆహారం, ఆరోగ్యమిత్రలు హాస్పిట‌ల్‌లో ఉండాల‌న్నారు.

క‌రోనా హాస్పిట‌ల్స్‌లో కూడా ఇవే ప్ర‌మాణాలు పాటించాల‌న్నారు. అధికారులు 104 కాల్ సెంట‌ర్ ప‌నితీరుపై మాక్ కాల్స్ చేస్తూ ప్ర‌తి రోజూ స‌మీక్షిస్తుండాల‌న్నారు. హాస్పిట‌ల్స్‌లో వైద్య సేవ‌లు, స‌దుపాయాల‌కు గ్రేడింగ్ విధానం అమ‌లు చేయాల‌న్నారు. 15 రోజుల్లోపు ఇది అమ‌లు కావాలన్నారు. సీఎం జ‌గ‌న్ ఆరోగ్య శ్రీ ప‌ట్ల తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను గ‌మ‌నిస్తున్న వారు వైఎస్సార్ ను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్ప‌టికై పేద‌ల‌కు వైద్యం అందాల‌న్న ఉద్దేశంతో జ‌గ‌న్ అన్ని విధాలా చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here