దక్షిణాది సినిమా హీరో చెంప పగలకొట్టిన రాధిక ఆప్టే

బాలీవుడ్ హాట్ భామ రాధిక ఆప్టే సంచలన కామెంట్స్ చేసిన దక్షిణాది సినిమా రంగంపై. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ నేహా దూపియా వ్యాఖ్యాతగా మారిన సంగతి తెలిసిందే. బీఎఫ్ఎఫ్ విత్ వోగ్ కార్యక్రమంలో ఆమె పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన స్నేహితులను ఇంటర్వ్యూ చేస్తోంది. అలా రాధికా ఆప్టేను… రాజ్కుమార్ రావ్ను పిలిచింది. ఈ సందర్భంగా రాధిక ఆప్టేను సినిమారంగంలో హీరోయిన్లు ఎదుర్కొనే లైంగిక వేధింపుల విషయంలో ప్రశ్నలు అడిగింది.
రాధిక ఆప్టే సమాధానం ఇస్తూ సినిమారంగంలో హీరోయిన్లు అనేక లైంగిక వేధింపులు ఎదుర్కోవడం నిజమే అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాధిక ఆప్టే తనకు ఎదురైన ఒక చేదు అనుభవంను పంచుకున్నారు. తాను ఓ దక్షిణాది సినిమా చేసేందుకు వెళ్లానని చెప్పింది. తొలి రోజు షూటింగ్ కు వెళ్లానని ఆ హీరోతో ఇంతకుముందు నటించలేదని చెప్పింది. ఆ హీరో తన కాళ్లపై కితకితలు పెట్టాడని కోపమొచ్చి చెంప చెళ్లుమనిపించానని చెప్పింది. రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి భారత సినిమా రంగంలో.
దక్షిణాదిలో రాధిక ఆప్టే వర్మ డైరెక్షన్ లో రక్తచరిత్ర , బాలకృష్ణ హీరోగా లెజెండ్,లయన్ సినిమాలో నటించింది…అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ తో కబాలి సినిమా నటించింది. ఈ క్రమంలో వీరిలో ఎవరి చెంప పగలగొట్టింది రాధిక ఆప్టే అని ఇండస్ట్రీ వారు చర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here