బన్నీ సినిమాని బాలీవుడ్ హీరో చేస్తున్నాడు

కథలని ఎంచుకోవడంలో చాలా పరిశీలిస్తాడు హీరో అల్లు అర్జున్. స్టోరీలో దమ్ముంటే గాని సినిమాకి సంతకం చేయడు. కచ్చితంగా సినిమాల విషయంలో నచ్చితేనే చేస్తాడు బన్నీ.  ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు బన్నీ. అంతేకాకుండా బన్నీ మార్కెట్ సినిమా సినిమాకీ పెరుగుతుంది. అయితే ఈ క్రమంలో బన్నీ ఇదే జోరు కొనసాగించాలని తనకు సూటయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో రీసెంట్ గా బన్నీకి ఓ ప్రముఖ దర్శకుడు చెప్పిన కథ అస్సలు నచ్చలేదట. దీంతో ఆ దర్శకుడు అదే కథను బాలీవుడ్ హీరోకి చెప్పడంతో ఒకే చేశాడని తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.

మనం దర్శకుడు విక్రమ్ కె కుమార్. రీసెంట్ గా అల్లు అర్జున్ కి ఒక డిఫెరెంట్ కాన్సెప్ట్ ని చెబితే నచ్చలేదని డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేశాడట. అయితే విక్రమ్ బన్నీ రిజెక్ట్ చేసిన కథను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి చెప్పడంతో వెంటనే ఆయన ఒకే చేశారని సమాచారం. మళ్లీ యమైన సినిమాలు చేయడంలో ఎక్కువ ఉత్సాహం చూపించే అక్షయ్ కుమార్ ఈ సినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. మొత్తమ్మీదా బన్నీ కారణం కథ బాలీవుడ్ ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్ చేస్తున్నాడు. సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here