రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తాం అంటున్న పవన్ కళ్యాణ్?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశమయ్యాయి. ఎప్పుడూ లేనివిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన కొడుకు నారా లోకేష్ మీద పవన్ చేసిన కామెంట్స్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి తప్పు చేశానని ఒప్పుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వనని స్పష్టంగా తెలిపారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలలో వైసిపి అధినేత జగన్ కి మద్దతు ఇవ్వడానికి రెడీ అని అన్నారు పవన్. ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ ఇటీవ‌ల కాలంలో జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను క‌లిశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఆహ్వానం మేర‌కు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశాన‌ని వ‌ర‌ప్ర‌సాద్ తెలిపారు. ఆ స‌మ‌యంలో ఇరువురి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌న‌ను వ‌ర‌ప్ర‌సాద్ మీడియాకు వివ‌రించారు.

ప్ర‌త్యేక హోదా గురించి వైసీపీ ఎంపీలు పార్ల‌మెంట్‌లో బాగా పోరాడుతున్నార‌ని అభినందించార‌న్నారు. మా పార్టీ వాళ్ల‌ను వైసీపీ నేత‌లు ఎందుకు విమ‌ర్శిస్తున్నారు… అందుకు గ‌ల కార‌ణ‌మేంట‌ని ప‌వ‌న్ న‌న్ను(వ‌ర‌ప్ర‌సాద్‌) ప్ర‌శ్నించార‌ని, అందునే స్పందించిన నేను (వ‌ర‌ప్ర‌సాద్‌) చంద్ర‌బాబు అవినీతిపై మేం పోరాడుతుంటే.. మీరేమో టీడీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించాన‌న్నారు. పోల‌వ‌రం అవినీతి విష‌యంలోనూ మేం ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తుంటే.. మాకంటే మీరు ముందు స్పందించి ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించార‌న్నారు. గతంలో నా దగ్గర సరిగ్గా సమాచారం లేక జగన్ పై విమర్శలు చేశానని పవన్ తప్పు ఒప్పుకున్నారు. వచ్చేఎన్నికలలో అవసరమైతే వైసీపీకి మద్దతు ఇస్తానని పవన్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here