జగన్ తీసుకున్న నిర్ణయానికి దెబ్బకు దిగివచ్చిన చంద్రబాబు

వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ముందునుండి పట్టుపడుతున్న నాయకుడు వైసిపి అధినేత జగన్. ఒకానొక సందర్భంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టేసినప్పుడు జగన్ ప్రత్యేక హోదా గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో వినూత్న కార్యక్రమాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి జరుగుతుందని సరిగ్గా వ్యవహరించారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా ఏమైనా సంజీవన అన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని యూటర్న్ తీసుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు గత నాలుగు సంవత్సరాలుగా జగన్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ఎంపీలతో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. అయితే కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని అధికార టీడీపీ పార్టీ నిర్ణయి౦చింది.మంత్రులు, పార్టీ కీలక నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పెట్టే అవిశ్వాసానికి మనమెందుకు మద్దతు ఇవ్వాలని కొందరు మంత్రులు సీఎంను ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఏ అంశానికైనా మద్దతు ఇచ్చేందుకు టీడీపీ రెడీగా ఉండాలని బాబు సూచించినట్లు సమాచారం. తాజాగా జగన్ తీసుకొన్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలలో కూడా సంచలనం అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here