ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ వివరాలు

బాహుబలి సినిమా తరవాత ప్రభాస్ చాలా కాలం గ్యాప్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ దేశంలోనే ఇంత పెద్ద హిట్ బాహుబలి సినిమా కొట్టిన తరువాత కచ్చితంగా హిట్టు కొట్టాలని నేపథ్యంలో Sujit దర్శకత్వంలో సాహో సినిమా చేయడం జరిగింది. అప్పట్లో ప్రభాస్ బాహుబలి ది కంక్లూజన్ తో పాటే సాహో టీజర్ ను విడుదల చేశాడు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు సాహో సినిమా తొందరగా విడుదలవుతుంది అని అనుకున్నారు. అయితే ప్రస్తుతం సినిమా సగం కూడా పూర్తి కాలేదు.

ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ సన్నివేశాలు దుబాయ్ దేశంలో జరుగుతున్నయి. ఈ సందర్భంగా ఈ సినిమా రావడానికి చాలా ఆలస్యం అవుతుందని ముందే గ్రహించిన ప్రభాస్ తన తర్వాత సినిమాని మొదలుపెడతానని కి రెడీ అయిపోయాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో పూజా హెగ్డేతో రొమాన్స్ చేయనున్నాడు ప్రభాస్. ఈ మూవీ షూటింగ్ ను జూలైలో మొదలుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.సాహో సినిమా కంటే ముందే ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here