లోకేష్ అవినీతికి అవధులు లేవు: జనసేన మహాసభలో పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ 4 వసంతాల ముగించుకొని 5 వ సంవత్సరంలో అడుగుపెట్టిన నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుంటూరు వేదికగా నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ క్రమంలో రాష్ట్రం నలుమూలల నుండి ఈ వేడుకకు పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతిని అలాగే ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ అవినీతిని కడిగేశారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ లోకేష్ అవినీతికి అవధులు లేవు. లోకేష్ అవినీతి మీ దృష్టికి వచ్చిందో..లేదో తెలియదు.నారా లోకేష్ మాత్రం చాలా దారుణంగా అవినీతికి పాల్పడుతున్నాడని జనసేన అధినేత పవన్ ఫైర్ అయ్యారు.ఏపీ లో  మీరు చేస్తున్న అవినీతి పనులకు ఎన్టీఆర్ ఆత్మ క్షోబిస్తుంది..”అని విమర్శలు గుప్పించారు. ” సింగపూర్ లాంటి రాజధాని కావాలంటే..సింగపూర్ లాంటి పరిపాలన కావలి.ఇకపై టీడీపీ సర్కార్ వైఫల్యాలను ఎండగాడతాం..ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్న మిముల్నిఇక ప్రతి రొజూ నిలదిస్తాం ..పర్యావరణం కోసం పోరాడితే ఓ మహిళను 40 రోజులు జైలులో పెడతారా “అంటూ టీ డీ పీ సర్కార్ పై పవన్ మండిపడ్డారు.ఇదే తరహా అవినీతి చేసుకుంటూ పోతే రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మట్టికొట్టుకుపోతుంది అని శపించారు పవన్ కళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here