పూరీ జగన్నాథ్ అంటే భయపడుతున్న వెంకటేష్

కొన్ని హీరో – డైరెక్టర్ కాంబినేషన్ లు చూస్తే ముచ్చటేస్తుంది. వీరిద్దరి సినిమా ఎప్పుడు వస్తుందా అన్నట్టు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తారు. అలాంటి కాంబినేషన్ బాలయ్య – పూరీ లది. ప్రస్తుతం షూట్ లో ఉన్న వీరిద్దరూ సినిమాని త్వరగా కంప్లీట్ చేసి విడుదల చెయ్యాలి అని చూస్తున్నారు. అయితే ఇలాంటిదే మరొక ఆసక్తికర కాంబినేషన్ రాబోతోంది అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. హీరో వెంకటేశ్ కి పూరీ జగన్నాథ్ ఒక కథ చెప్పాడు అని మనందరికీ తెలుసు. ఇది జనగణమన కథ గా చెబుతున్నారు, వెంకీ ఈ విషయం లో ఇంకా ఏదీ తేల్చుకోక పోవడం తో బాలయ్య దగ్గర వేరే కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు పూరీ.

జనగణమన కథ కి బడ్జెట్ ఎక్కువ ఉండడం తో తానే ప్రొడ్యూస్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్న వెంకీ బాలయ్య సినిమా తరవాత ఇది చేద్దాం అనుకున్నాడట. కానీ రోగ్ సినిమా రిజల్ట్ దెబ్బకి కుదేలు అవుతున్న ప్రొడ్యూసర్ లని చూసి వెంకీ మనసు మార్చుకున్నాడు అంటున్నారు. పూరితో కంటే తేజ డైరెక్షన్‌లో చేయడం బెటరని అనుకుంటున్నాడట. తేజ తనకోసం ఏదో కథ సిద్ధం చేసాడని తెలిసి అతడిని రమ్మని కబురంపించాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here