అమరావాతి లో ఇరవై ఎకరాల్లో , అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం

నవ్యాంధ్ర రాజధాని అమరావతి లోని శాఖమూరు – ఐన వోలు ప్రాంతాల మధ్యన దాదాపు ఇరవై ఎకరాలు వెచ్చింది అతిపెద్ద అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అంబేద్కర్ కి సంబంధించి ఒక మెమోరియల్ హాల్, ధ్యానమందిరం, మెమోరియల్ గార్డెన్, బస్ పార్కింగ్, కన్వెన్షన్ హాల్, యాంపీ థియేటర్, గ్రంథాలయం, బహిరంగ ప్రదర్శనశాల లాంటివి ఏర్పాటు చేస్తారు. దాంతో పాటు అంబేద్కర్ కి సంబధించిన ఒక కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తారు.

దీని హైట్ 125 అడుగులు గా చెబుతున్నారు. లింగాయ పాలం లో ఇప్పటికే నిర్మిస్తున్న సీడ్ యాక్సిస్ రోడ్డు , ప్రభుత్వ భవనాల కి ఆపోజిట్ లో అంబేద్కర్ విగ్రహం రానుంది. ఈ విషయం మీద భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఇంకా రాష్ట్రాన్ని నష్టాలలో తోసేస్తోంది అని కొందరు అంటూ ఉంటె మరికొందరు మాత్రం దళిత నాయకుడిని గౌరవుంచికోవాలి అంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here