మహేష్ బాబు వెనకాలే పడుతున్న జగన్ .. వదిలే సమస్యే లేదు అంటున్నాడు

మహేష్ బాబు తో పోకిరి సీక్వెల్ కానీ బుసినెస్ మ్యాన్ సీక్వెల్ కానీ చెయ్యాల్సి ఉంది పూరీ జగన్నాథ్. జనగణమన అంటూ కొత్త ప్రపోసల్ పెట్టిన తరవాత ఆ రెండూ ఆపేశారు వారు. అయితే పూరీ ప్రెజెంట్ ఫార్మ్ అట్టర్ ప్లాప్ లతో నడుస్తూ ఉండడం తో మహేష్ కూడా పెద్ద ఆసక్తి చూపించడం లేదు. కథ చెప్పినప్పటి నుంచే మహేష్ ఓకే అన్నాడు కానీ కాల్ షీట్ లు మాత్రం ఇవ్వడం లేదు.

త్వరలో మహేష్ ని కలిసి ఈ కథ ని మార్పులు చేసి మళ్ళీ వినిపిస్తా అంటున్నాడు పూరీ. బాలయ్యతో ఒక కమర్షియల్ సినిమా ని తీస్తున్న   పూరీ ఆ చిత్రం చాలా పెద్ద హిట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రం రిజల్ట్ కి మహేష్ తన దగ్గరకి వచ్చి తీరాలి అనేది పూరీ ప్లాన్. అయితే పూరీ జగన్నాథ్ మహేష్ కోసం మరొక కథ రాసాడట. ఇది జనగణమన కాకుండా మరొక చిత్రం.

అయితే పూరి ఒక పెద్ద హిట్‌ ఇస్తే తప్ప మహేష్‌ అతనితో సినిమా పట్ల ఆసక్తి చూపించడేమో. అసలే బ్రహ్మూెత్సవం లాంటి చేదు ఫలితాలతో మహేష్‌కి జాగ్రత్త పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here