పూరీ బ్రేకప్ వేదాంతం విన్నారా..!

తన సినిమాలతో ఎప్పుడు సంచలనాలకు తెరతీసే దర్శకుడు పూరీ జగన్నాథ్, సొంత అభిప్రాయాలను ఎలాంటి మొహమాటం లేకుండా చెబుతుంటాడు పూరీ. ఈ క్రమంలోనే ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో కొన్ని ఆడియోలను విడుదల చేస్తున్నాడు. ఏదో ఒక టాపిక్ పై తన అభిప్రాయాలను విపులంగా తెలియజేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘బ్రేకప్’ (ప్రేమ విఫలం) అనే అంశంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పూరి.

 

పూరీ జగన్నాథ్ ఏం చెప్పాడంటే… ‘ఎవరికైనా బ్రేకప్‌ అయ్యిందని తెలిస్తే నేను చాలా హ్యాపీగా ఫీలవుతాను. ఎందుకంటే బ్రేకప్‌ అనేది ఇద్దరికీ మంచిదే. ప్రేమ వల్ల వీక్‌ అవుతాం. బ్రేకప్‌ మనల్ని స్ట్రాంగ్‌గా మారుతాం. బ్రేకప్‌ అవగానే గట్టిగా ఏడ్చి, ఫ్రెష్‌గా స్నానం చేసి, ఓ పెగ్గేసి పడుకోండి. మళ్లీ మరుసటి రోజు ఆ పెంట క్యారీ చేయొద్దు. ఈగో ఎక్కువగా ఉన్నవాళ్లు ఎక్కువగా ఏడుస్తారు. ఇంకా ఎక్కువ ఈగో ఉన్నవాళ్లు కోసేసుకుంటారు. రాంగ్‌ పర్సన్‌ మీద ఇంత ఇన్వెస్ట్‌ చేశాను. మన టైం అంతా దొబ్బిందనే ఏడుస్తామే తప్ప, ఆ అమ్మాయి కోసం కాదు. అదే టైమ్‌లో మన ఫ్రెండ్స్‌ ఎవరైనా మన భుజం తట్టి ఓదారుస్తుంటే ఇంకా ఏడుపొస్తుంది. సింపతీ బావుందని ఇంకా ఏడుస్తాం. బ్రేకప్‌ గురించి బాధపడొద్దు. ఎన్నీ బ్రేకప్‌లైతే అంత స్ట్రాంగ్ అవుతారు. నెక్ట్స్‌ బ్రేకప్‌కి ఇంత పెంట లేకుండా గ్రేస్‌ఫుల్‌గా విడిపోవడం. నేర్చుకోండి. మా అమ్మాయి ఎవడితోనో లవ్‌లో ఉందని తెలిసి, కంగారు పడిపోయి, వాడికి వార్నింగ్‌లిచ్చి మాగ్జిమమ్‌ విడదీయడానికి ట్రై చేస్తాం. అవసరం లేదు. కాస్త టైమ్‌ ఇస్తే వాళ్లకి బ్రేకప్‌ అయిపోద్ది. వాళ్లు విడిపోవడానికి టైమ్ ఇవ్వాలి కదా!. మన హడావుడి చూసి వాళ్లు లేచిపోతారు. గుళ్లో పెళ్లి చేసుకుంటారు. ఒకరంటే ఒకరికి తెలియకపోవడం వల్లే వాళ్లు ప్రేమలో పడతారు. తెలిసిన రోజు విడిపోతారు. టైమ్ ఇవ్వండి సార్‌! నాలుగు రోజులు తిరగనివ్వండి. కొట్టుకునే టైమ్‌ ఉండాలిగా. ప్రేమించడం, దాని కోసం నిలబడే యెధవలు ఈరోజుల్లో దొరకడం చాలా కష్టం. వదిలేస్తే అన్నీ బ్రేకప్‌ కేసులే” అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు పూరీ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here