పునర్నవి ఎంత మోసం చేసిందో చూడండి..!

గత రెండు రోజులుగా పునర్నవి సోషల్ మీడియా వేదికగా తెగ హల్‌ చల్ చేస్తోంది. తన ఎంగేజ్‌మెంట్‌ జరిగిపోయిందని వేలుకి ఉంగరాన్ని ధరించిన ఫొటోతో పాటు ఉద్భవ్‌ రఘునందన్‌ తనకు కాబోయే వాడంటూ వరుస పోస్ట్‌లు చేసింది. అయితే అప్పటికీ చాలా మంది అభిమానులు ఇదేదో షార్ట్‌ మూవీ కోసం చేస్తోన్న జిమ్మిక్కు అంటూ కామెంట్లు పెట్టారు. అయితే పునర్నవి మాత్రం నటించడం మానేసి జీవించేసింది. శుక్రవారం ఒక పెద్ద వార్త చెప్పబోతున్నాం అని ఉద్భవ్‌ ఫొటోను షేర్‌ చేసింది. ఇక ఉద్భవ్‌ కూడా నేనేం తక్కువ తిన్నానా అన్నట్లు.. పునర్నవి తనకు ఎట్టకేలకు ఓకే చెప్పింది అంటూ హగ్‌ చేసుకున్న ఫొటో పోస్ట్ చేశాడు. దీంతో దాదాపు అందరూ ఇది నిజమేనని ఫిక్స్‌ అయ్యారు.

అయితే అందరినీ బకరాలు చేస్తూ పునర్నవి కొద్ది సేపటి క్రితం ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేసింది. ఈ చిన్నది రెండు రోజులుగా ఆడుతోన్న నటకానికి తెరతీస్తూ.. తాను తాజాగా నటిస్తోన్న ‘కమిట్‌ మెంటల్‌’ అనే వెబ్ సిరీస్‌ పోస్టర్‌ను పోస్ట్‌ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఫొటోతో పాటు.. ‘తప్పలేక ఒప్పుకున్నాను. ఇక ముందు నుంచి అసలైన క్రేజీ రైడ్‌’అనే ఫన్నీ క్యాప్షన్‌ను జోడించింది. ఇక పునర్నవి పబ్లిసిటీ తీరు చూసిన కొందరు నెటిజెన్లు ఈ విషయం మాకు ముందే తెలుసు.. ఎంత మోసం చేశావు.. ఇంత దానికే ఇదంతా చేశావా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here