అమెరికా ఎన్నిక‌ల్లో గెలుపు ఎవ‌రిదో చెప్పిన భార‌తీయ జ్యోతిష్కుడు..

ప్ర‌పంచం మొత్తం ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నిక‌లు వ‌చ్చేశాయి. అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సారి ఎలాగైనా ఈ ఎన్నిక‌ల్లో గెలవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఇక ప్ర‌త్య‌ర్థి జో బైడెన్ కూడా ఈ సారి అధ్య‌క్ష్య పీఠం ఎక్కాల‌ని ఎదురుచూస్తున్నారు. హోరాహోరీగా ప్ర‌చారం కూడా చేస్తున్నారు.

ఇరువురు అభ్య‌ర్థులు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు విమ‌ర్శ‌లు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. దీంతో అమెరికా అధ్యక్ష్య ఎన్నిక‌లపై ప్ర‌పంచం మొత్తం ఆస‌క్తిగా చూస్తోంది. ప్ర‌ధానంగా భార‌త్‌లో కూడా ఈ ఎన్నిక‌ల గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుకంటే అమెరికాలో ప్ర‌చారంలో భాగంగా ట్రంప్ భార‌త్‌పై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. క‌రోనా మ‌ర‌ణాలతో పాటు కాలుష్యంపై కూడా ఆయ‌న మాట్లాడారు. దీనిపై భార‌త్ రాజ‌కీయాల్లో కూడా చ‌ర్చ జ‌రిగింది.

ఈ ప‌రిస్థితుల్లో అమెరికా ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తార‌న్న దానిపై బార‌తీయ జ్యోతిష్కుడు శంకర్ చరణ్ త్రిపాఠి చెబుతున్నారు. ఈయన ఆర్జేడీ మాజీ నేత. గతంలో ఆర్జేడీ అధికార ప్రతినిధిగా శంకర్ చరణ్ త్రిపాఠి పని చేశారు. 2018లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల పార్టీ నుంచి ఆయనను తొలగించారు. రాజకీయాల్లో లాలూ ప్రసాద్ హవా కొనసాగిన సమయంలో ఆయనకు శంకర్ చరణ్ త్రిపాఠి సలహాలు సూచనలు ఇస్తుండేవారు. నవంబర్ 3న జరగబోయే ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయ ఢంకా మోగిస్తారని ఈ జ్యోతిష్కుడు అంటున్నారు.

ట్రంప్‌, జో బైడెన్ గ్రహాల స్థితిగతులు, జన్మించిన ప్రదేశం, పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తారని అంచనా వేశారు. జో బైడెన్ పోటీ ఇచ్చిన‌ప్ప‌టికీ విజ‌యం మాత్రం ట్రంప్ దే అంటున్నారు. 9 లక్ష‌ల లోపే ట్రంప్ మెజార్టీ అని తెలిపారు. కేవ‌లం నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల‌ను బ‌ట్టే ట్రంప్ విజ‌యం ఉంటుంద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ గెలిచిన త‌ర్వాత ట్రంప్ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటార‌ని జ్యోష్యం చెప్పారు. మ‌రి ఎన్నిక‌ల్లో ఎవ‌రు విజ‌యం సాధిస్తార‌న్న‌ది వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here