నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో పాయల్‌..!

కెరీర్‌ తొలినాళ్ల నుంచి ఎక్కువగా గ్లామర్‌ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది అందాల తార పాయల్‌ రాజ్‌పుత్‌. కమర్షియల్‌గా హిట్‌లు అందుకుంటున్నా.. ఫేమ్‌ సంపాదించుకుంటున్నా.. ఇప్పటి వరకు నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలో మాత్రం పెద్దగా కనిపించలేదు. వెంకీ మామ చిత్రంలో అందాల ప్రదర్శన చేయకపోయినా నటనకు మాత్రం పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలో నటించింది.

ఇదిలా ఉంటే పాయల్‌ కెరీర్‌లో తొలిసారి నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది. పాయల్‌ ప్రస్తుతం ‘అనగనగా ఓ అతిథి’ అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో పాయల్‌ పాత్రను పరిచయం చేస్తూ.. చిత్ర యూనిట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిన్నది ఇందులో ‘మల్లిక’ అనే పాత్రలో నటిస్తోంది. పేదరికంలో నివసిస్తున్న ఓ కుటుంబంలోకి అనుకోని ఓ అతిథి వచ్చిన తరువాత వారికి ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో పాయల్‌ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించనుందని సమాచారం. ‘అనగనగా ఓ అతిథి’ చిత్రం నవంబర్ 13న ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here