లంచగొండు అధికారుల గుండెల్లో నిద్రపోతున్న ఏసీబీ కొత్త డీజీ

సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి తనదైన రీతిలో పాలన అందిస్తూ ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం నుండే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుపోతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ అధికారులందరికీ చెప్తున్న ఒకే ఒక మాట ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా మార్చాలి అని, దీనికి తగిన ప్రణాళికల్ని సరిగ్గా అమలుచేస్తున్నప్పటికీ కూడా కొందరు ప్రభుత్వ ఉద్యోగుల చేతివాటం వల్ల ప్రభుత్వం అనుకున్న లక్ష్యం పూర్తిగా నిరవేరడం లేదు. ఈ మద్యే ఏసీబీ పనితీరు పై సీఎం జరిపిన సమీక్షలో ఏసీబీ అధికారులపై అసహనం వ్యక్తం చేసారు. రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా మార్చాలి అంటే కీలకంగా వ్యవహరించాల్సిన ఏసీబీ లో నే ఇలా ఉంటే ఎలా అంటూ అధికారులు ముందు అసంతృప్తిని వ్యక్తం చేసారు. అలాగే మరికొన్ని రోజుల్లోనే ఏసీబీ లో పనితీరు మెరుగుపరుచుకోవాలి అని తెలిపారు.

ఇక ఏసీబీ ఇదే తరహాలో కొనసాగితే సీఎం అనుకున్న అవినీతి రహిత రాష్ట్రంగా ఏపీని చూడాలి అంటే చాలా కాలం పడుతుంది అని , ఏకంగా ఏసీబీ డీజీ నే మార్చేశారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా ఉన్న కుమార విశ్వజిత్‌ పై బదిలీ వేటు వేసి అయన స్థానంలో ఏపీ సీతయ్య గా పేరుగాంచిన పీఎస్సార్ ఆంజనేయులును ఏసీబీ డీజీ గా నియమించారు. ఈయన గతంలో ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఉంది. ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా పనిచేసిన సమయంలో మహా మహా నేతలని కూడా ఎదిరించి నిలబడిన ఘనమైన చరిత్ర ఈయన సొంతం. ట్రాన్స్ పోర్ట్ డిపార్మెంట్ లో అవినీతి అనేది లేకుండా చేశారు. ప్రయివేటు ట్రావెల్స్ దందాని పూర్తిగా కట్టడి చేశారు. ఏకంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడి నుంచి కూడా రివకరీ చేయగలిగారు. అలాగే జేసీ దివాకరరెడ్డి వంటి నాయకుడికి ఎదురెళ్లి నిలిచారు. ఒక్కసారి వార్ డిసైడ్ చేసారు అంటే ఎదురు ఎవరొచ్చినా ఆ పని చేసితీరుతారు అని డిపార్ట్మెంట్ లో మంచి గుర్తింపు ఉంది.

అయన పనితనం, నిజాయితీ నచ్చిన సీఎం సీఎం జగన్ ఏరికోరి ఏసీబీ డీజీ గా నియమించారు. అయితే , సీఎం జగన్ దేనికోసమైతే ఏరికోరి ఈ పీఎస్సార్ ఆంజనేయులు ను ఏసీబీ డీజీ గా నియమించారో ..అయన డీజీ గా ఛార్జ్ తీసుకున్న నాలుగు రోజుల్లోనే అందరికి తెలిసేలా చేసారు. ఏసీబీ డీజీ గా రిపోర్ట్ చేసిన మరుక్షణం నుండే పని మొదలు పెట్టిన ఈయన ..ఏసీబీ లో అవినీతి అనేది లేకుండా కూకటివేళ్ళతో సహా పీకేసే ప్లాన్ వేశారు. ఛార్జ్ తీసుకున్న వెంటనే రాష్ట్రంలోని 13 జిల్లాలలోని ఏసీబీ అధికారులని అప్రమత్తం చేసి, సోదాలు నిర్వహించేలా చూస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయంల పై ఏసీబీ అధికారులు దాడులు చేసి , అక్కడ జరిగే అవినీతిని పారదోలుతున్నారు. అలాగే ఈ నాలుగు రోజుల్లోనే ఏసీబీ అధికారులు చాలా అనధికార సొమ్మును స్వాధీనం చేసుకునట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో అవినీతి ఎక్కువగా జరిగే రిజిస్టర్ ఆఫీస్లలో కూడా ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయి. మొత్తంగా ఛార్జ్ తీసుకున్న నాలుగు రోజుల్లోనే లంచానికి అలవాటు పడ్డ అధికారుల గుండెల్లో నిద్రపోతూ తానేంటో అందరికి తెలిసేలా చేస్తున్నారు. ఈయన పనితీరు ఇలాగే కొనసాగితే సీఎం జగన్ అనుకున్న అవినీతిరహిత ఆంధప్రదేశ్ ని అతి త్వరలోనే చూడచ్చు ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here