ఆ సీనియర్ ఆధికారి టిడిపి కోవర్ట్ – పసిగట్టి సాగనంపిన ప్రభుత్వం

తాము అధికారంలో లేనప్పుడు ప్రభుత్వంలో ఏం జరుగుతోందో, తామే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఏం చేస్తోందో తెలుసుకునేందుకు కోవర్ట్ను ప్రవేశపెట్టడం తెలుగుదేశం నాయకుడు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆ విధంగా లోగుట్టు సమాచారం సేకరించడంతో పాటు అవతలి పార్టీని ఇరుకున పెట్టడం ఆయనకు ఆనవాయితీనే. ఈ విధమైన కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు సాగించే తెలుగుదేశం పార్టీకి తాజాగా షాక్ తగిలింది.

గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతోందో అంతర్గత సమాచారం సేకరించేందుకు ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తుగడలను అధికార పార్టీ చిత్తుచేసింది. ఏసీబీలో ఉన్న ఓ అధికారి గతంలో ఇంటిలిజెన్స్లోనూ అదే పనిచేస్తుండేవాడు. ఆ విషయం ఆధారాలతో సహా పట్టేసిన ప్రస్తుత ఉన్నతాధికారులు ప్రభుత్వంలోని పెద్దల ముందు ఉంచడంతో ఏసీబీలో ఒక ఉన్నత అధికార బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు.

ఇటీవలనే బదిలీ అయిన ఒక ఆఫీసర్ వైయస్సార్సీపీకి అనుకూలంగా నటిస్తూ పార్టీకి సంబంధించిన ముఖ్యంగా వైయస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా అప్పటి ఇంటిలిజెన్స్ అధికారులకు చేరవేస్తుండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన వైయస్సార్సీపీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కోవర్ట్గా వ్యవహరించారు. ఇప్పటివరకూ కూడా అదే పని కొనసాగించారు.

వైయస్సార్సీపీలో సమగ్ర సమాచారాన్ని సేకరించడం కోసం ఆయన పార్టీలోని అన్నిస్థాయి నాయకులతోనూ సత్సంబంధాలు కొనసాగించేవాడు. పార్టీ సానుభూతిపరుడిగా ముద్రవేయించుకున్నారు. ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ముఖ్యనాయకులు కూడా విశ్వసిస్తున్నారు. వాస్తవానికి ఆయన తెలుగుదేశం పార్టీకి అవసరమైన సమాచారం సేకరించడం కోసమే ఆయన ఆ విధంగా వ్యవహరించారు. వైయస్ జగన్మోహన్రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా చెప్పుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. నాటి ప్రభుత్వంలో ఇంటిలిజెన్స్ విభాగంలో పనిచేసి రాయలసీమలో మరీ ముఖ్యంగా కడప, కర్నూల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం పనిచేశారు. వైసీపీ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీశారు.

రాజశేఖరరెడ్డి మరణానంతరం రిలయన్స్కు సంబంధించిన రిటైల్ స్టాల్స్పై జరిగిన దాడుల వెనుక జగన్ మోహన్రెడ్డి గారి ప్రత్యక్ష ప్రమేయం ఉందని, ఆయన ప్రోద్బలంతోనే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో పలుచోట్ల విధ్వంసం జరిగిందని నాడు ప్రభుత్వానికి నివేదించారు. అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ పూర్తిగా సృష్టించిన ఆధారాలను, దొంగ కాల్డేటాను నాడు ప్రభుత్వానికి సమర్పించారు. రిలయన్స్ దాడుల వెనుక జగన్ ప్రమేయం ఉందని అన్నివర్గాల వారిని నమ్మించడానికి శతవిధాల ప్రయత్నించారు. పోలీస్ శాఖలో ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులతో సంబంధాలు ముఖ్యంగా అప్పటి డిజిపి తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడైన ఒక ఐపీఎస్ అధికారి కనుసన్నల్లో వారు చెప్పినవిధంగా పనిచేస్తూ ఉండేవారు.

ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను ప్రభుత్వం, మరీ ముఖ్యంగా జగన్మోహన్రెడ్డిగారి ప్రయోజనాలకోసం పనిచేస్తున్నట్టు బహిరంగంగా చెప్పుకుంటూ వన్మ్యాన్ ఆర్మీ తరహాలో వ్యవహరించారు. వ్యక్తిగత కీర్తి కండూతి ఎక్కువ. పేరు ప్రఖ్యాతలకోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండేవారు. ఆ ఆఫీసర్ బీసీ కులానికి చెందినవారు. గత అయిదు నెలల్లో పలువురు అధికారులపై అవినీతికి సంబంధించిన కేసులు బనాయించారు. ఆయన వ్యవహారశైలిపై కూడా తీవ్ర విమర్శలు ఉన్నాయి. అహంభావంతో, ఆధిపత్యంతో, తాను చెప్పిందే వినాలనే ధోరణితో వ్యవహరిస్తుంటారు. ఇటీవల కర్నూల్ సబ్రిజిస్టార్ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసు బనాయించకుండ ఉండేందుకు రూ. 50 లక్షలు డిమాండ్ చేశారనేది చర్చనీయాంశమైంది. ఆ అధికారి తొలుత 10 లక్షల రూపాయలు చెల్లించారట.

అదే విధంగా ఒక మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ నుంచి కూడా ఇదే విధంగా డబ్బు వసూలు కోసం ప్రయత్నించి విఫలం కావడంతో కేసు బనాయించారు. ఒక జిల్లా పోలీసు శాఖలో ఓసీ అధికారులు వర్సెస్ బీసీ అధికారులు అన్నట్లు పరిస్థితి ఉండేది. ఈయన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టాక ఈ వైషమ్యాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఓసీ అధికారులపై ఆయన కక్ష కట్టినట్లు వ్యవహరించారు. ఇటీవల సీసీఎస్లో పనిచేసే ఒక ఇన్స్పెక్టర్ను ఈయన పట్టుకున్నారు. ఆయన కమ్మ కులానికి చెం వారు. వాస్తదినవంగా ఆ ఇన్స్పెక్టర్  అవినీతి అధికారే. గతంలో కూడా ఆయన ఓ సారి ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ ఆధికారికి  తనను రోడ్డు మీద కాల్చి చంపుతానని బెదిరించారని, ‘నీపై ఎందుకు కేసులు పెడుతున్నానో తెలుసు కదా’ అంటూ భయపెట్టారని ఆ ఇన్స్పెక్టర్  మీడియా ఎదుట నాగభూషణంపై విమర్శలు గుప్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here