వరుస సినిమాలతో జోష్ మీదున్న ప్రియమణి..

ఎవరే అతగాడుసినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది నటి ప్రియమణి. అనంతరం పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళ చిత్రాల్లో నటించి జాతీయ ఉత్తమ నటిగా పేరు సంపాదించుకుందీ బ్యూటీ. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతోపాటు.. గ్లామర్ పాత్రల్లో  నటించి తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రియమణి.. సినిమాలతో పాటు, కొన్ని రియాలిటీ షోల్లోనూ కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇక ఇదిలా ఉంటే ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో దూసుకెళుతోందీ భామ. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్ననారప్పచిత్రంలో సుందరమ్మగా నటిస్తున్న ప్రియమణి, మరో చిత్రంవిరాటపర్వంలో కామ్రేడ్భారతక్కగా నటనకు అస్కారమున్న పాత్రలో నటిస్తోంది. ఇక రెండు సినిమాలే కాకుండా బాలీవుడ్‌, కన్నడలో కూడా ఆమె పలు చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటుది ఫ్యామిలీ మెన్‌’ సీజన్‌ 2 వెబ్సిరీస్లోనూ  కనిపించనుంది. ఇక తాజాగాకొటేషన్ గ్యాంగ్మరో కొత్త సినిమాకు సైన్ చేసిందీ చిన్నది. ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న  చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా ఉండనుందని సమాచారం.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here