‘ఆహా’ కోసం కొరటాల కథ…

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో వెబ్ సిరీస్ లు మరింత పాపులర్ అవుతున్నాయి. ఇక తాజాగా దర్శకుడు కొరటాల శివ కూడా వెబ్ సిరీస్ నిర్మించే పనిలో పడ్డాడు. శివ తన అసిస్టెంట్ కిరణ్ అనే నూతన దర్శకుడికి అవకాశం ఇస్తూ ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్  కోసం ఓ వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నాడు.

అయితే ఈ సిరీస్ కి కొరటాలనే స్వయంగా స్క్రిప్ట్ ను అందిస్తుండడం విశేషం. సినిమా కథాంశంతో సాగే ఈ సిరీస్ లో… సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాలు మోసాలతో పాటు సినిమా పై ఉన్న ప్రేమ, నిజాయితీని కూడా చూపించేలా కొరటాల స్క్రిప్ట్ రాశారట. వెండితెరపై సంచలనాలు సృష్టించిన కొరటాల శివ.. మరి డిజిటల్ స్క్రీన్ పై ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here